Pages

Saturday, November 13, 2010

KASHMIR - A FEW WORDS

నీవు దేనికోసమైనా అన్వేషిస్తున్నావా? హిమాలయ సానువులకు పోదాం రా!
అన్ని అన్వేషణలకూ ముగింపు అక్కడే దొరుకుతుంది!!
- స్వామి రామ


మిత్రమా...
హిమాలయాల సోయగం కాశ్మీరీ అందాల్లో,  అక్కడి ప్రజల్లో ప్రతిఫలిస్తుంది. ఆకాశాన్ని తాకే పర్వతాలు, మేఘాల్ని ముద్దాడే దేవదారు వృక్షాలు, కవ్వించి మళ్లీ మళ్లీ రప్పించే పువ్వులు, బొద్దుగా, బోసినవ్వులు నవ్వే చిన్నారికి మల్లే ఉండే మంచు పర్వతాలు... ముట్టుకుంటే మాసిపోయే అందాలు... కాశ్మీర్‌ సొంతం.
 2008 మేలో 27 మంది స్నేహితులం కలిసి, పదిరోజుల పాటు కాశ్మీర్‌ చుట్టొచ్చాం. గుల్‌మార్గ్‌, స్‌ోన్‌మార్గ్‌, శ్రీనగర్‌.. ఏం అందాలు? మా అదృష్టమో... దురదృష్టమో? అ సమయంలో మాత్రమే కాశ్మీర్‌ ప్రశాంతంగా ఉంది. ఆ తరువాత నుంచి మళ్లీ అలజడి మొదలు. ప్రపంచంలో ఉన్న అందాలన్నీ ఒక్కచోట పోగుపోసుకున్నట్టు ఉండే కాశ్మీరం ముందు స్విట్జర్లాండ్‌ వంటి అంతర్జాతీయ అందాలు చిన్నబోవాల్సిందే. ఆ అందాలరాశి ఇప్పుడు తుపాకీ చప్పుళ్లతో, వేర్పాటువాదంతో కుమిలిపోవడం దారుణం.
మేం ఏ ప్రదేశానికి వెళ్లినా "ఇక్కడకు తొందరలో మళ్లీ వచ్చి తీరాల''నే మాట మనసు చెలియలి కట్టను తోసుకుంటూ మాటగా బయటకు వస్తుంది. కాశ్మీర్‌ విషయంలో మాత్రం ఎవరం అలా అనుకోలేదు! కారణం...

మేం అందరం.. కనీసం చాలా మందిమి ఇప్పటికీ అక్కడే ఉన్నాం. ఆ మంచులో ఆడుతున్నాం. ఆ లోయల అందాలకు మైమరస్తున్నాం!!

రండి కాశ్మీరీ అందాలను నా కళ్లతో మీకు చూపిస్తాను. మీ మనసుకు అందినంత ఆస్వాదించండి!!

No comments:

Post a Comment

Followers