Pages

Monday, November 8, 2010

LIFE IS A JOURNEY!

నేస్తమా... నా ప్రియతమా!
పద పోదాం... ఈ విశాల ప్రపంచాన్ని చుట్టొద్దాం.
సంచారం కోసం నీకు మరో జన్మ ఉందంటావా ఏం?
నిండు నూరేళ్లూ జీవించినా ఈ ప్రాయం మాత్రం తిరిగి రాదు నేస్తం...
పద పోదాం... ఈ విశాల ప్రపంచాన్ని చుట్టొద్దాం.

- రాహుల్‌ సాంకృత్యాయన్‌ (1893 - 1963)

70 ఏళ్ల జీవితంలో 45 సంవత్సరాల పాటు సంచారంలో గడిపిన అద్భుత వ్యక్తి రాహుల్‌ సాంకృత్యాయన్‌. ప్రపంచం అంతా తిరిగిన ఆయన భారతదేశంలోని ఏ అందమైన ప్రదేశాన్నీ వదలలేదు. ఎక్కువ కాలినడకన లేదా స్థానికంగా అందుబాటులో ఉండే రవాణా సౌకర్యాల మీద ఆధారపడే వారు. మన రాష్ట్రంలోని తుమ్మపూడిలో కళాకారుడు సంజీవదేవ్‌ వద్ద వారం రోజులు ఉన్నారు. అక్కడ నుంచి తమిళనాడు వెళ్లి తమిళం నేర్చుకున్నారు. ప్రపంచంలోని అనేక భాషలు నేర్చుకున్నారు. వివిధ సంస్కృతీ సంప్రదాయాలను అధ్యయనం చేశారు. సాహిత్యం నుంచి తత్త్వం దాకా 100కు పైగా పుస్తకాలు రాశారు. హిమాలయ సానువుల మీదుగా నడుచుకుంటూ నేపాల్‌ వెళ్లడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. సాధువులతో కలిసిపోయి నెలల తరబడి నడుచుకుంటూ నాలుగు సార్లు నేపాల్‌ వెళ్లారాయన. బౌద్ధం అంటే ఎంతో ఇష్టపడే రాహుల్‌ నేపాల్‌లో చాలా కాలం గడిపారు. విస్తృతంగా యాత్రా సాహిత్యం రచించిన తొలి భారతీయుడు బహుశా ఆయనేనేమో! హిమాలయాల మీదుగా నేపాల్‌ ప్రయాణం గురించి చెబుతూ... "హిమాలయాల అందాలు చూస్తూ, నడుచుకుంటూ నేపాల్‌ వెళ్లడం ఓ అరుదైన, ప్రమాదరకరమైన అనుభవం. నిజానికి అప్పుడే జన్మ సార్థకం''. అంటారాయన. భ్రమణకాంక్షకు ప్రతిరూపం రాహుల్‌. సంచారమే ఆయన చేత అద్భుతమైన రచనలు చేయించింది. ప్రపంచ జీవన విధానం పట్ల లోతైన అవగాహన కల్పించింది.


ఎవరూ నడవని దారిలో నడుస్తున్నప్పుడు అవస్థలు ఉంటాయి..అద్భుతాలూ ఉంటాయి!!


రండి... రాహుల్‌ సాంకృత్యాయన్‌ స్ఫూర్తితో ఆలా సంచారం చేసి వద్దాం.

1 comment:

  1. మాస్టారూ, స్వామి రామ రాసిన ‘వాకింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్’ చదివారా? లేదంటే తప్పకుండా చదవండి. తెలుగులో కూడా వచ్చింది.

    ReplyDelete

Followers